ఖర్చు భరించలేక.. బిడ్డకు పురుగులు తినిపిస్తోంది!
Canada: ఓ తల్లి బిడ్డకు పురుగులనే ఆహారంగా పెడుతోంది(viral news). ఇందుకు కారణం పిల్లలకు(child) పెట్టే ఆహారం ఖరీదు ఎక్కువగా ఉండటమేనట. ఈ దారుణ ఘటన కెనడా(canada)లో చోటుచేసుకుంది. కెనడాలోని టొరంటో ప్రాంతానికి చెందిన టిఫనీ అనే మహిళ తన 18 నెలల బిడ్డకు క్రికెట్స్(crickets) అనే పురుగులతో చేసిన ఆహారాన్ని తినిపిస్తోంది. పెరిగిపోతున్న ధరలను భరించలేక ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం తన బిడ్డ ఆహారానికి నెలకు అయ్యే ఖర్చు రూ.25000 అట. అది భరించలేక క్రికెట్ పురుగులతో చేసిన పౌడర్‌ను పాలల్లో వేసి బిడ్డకు తినిపిస్తున్నట్లు వెల్లడించింది. పైగా పురుగులను తింటే ఏమీ కాదని, అవి తినగలిగేవేనని అంటోంది.
“నేను ఒక రచయిత్రిని. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు కావాలంటే ఖర్చు భారీగా అవుతోంది. నేను అంత పెట్టలేను. అందుకే క్రికెట్ పురుగుల నుంచి తయారుచేసిన ఆహారాన్ని తింటున్నాం. నా బిడ్డకు కూడా అదే పెడుతున్నాం. దీని వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్ బాగా అందుతుంది. పిల్లలకు 8 నెలల వయసు ఉన్నప్పటి నుంచి పురుగులను ఆహారంగా పెట్టచ్చు” అంటోంది టిఫనీ. కొందరేమో టిఫనీ నిర్ణయం పట్ల సపోర్ట్‌గా నిలిచారు. మరికొందరేమో పిల్లలకు పురుగులను తినిపించడం ఏంటి అని మండిపడుతున్నారు.