Viral News: హాస్పిట‌ల్‌లో న‌గ్నంగా తిరుగుతున్న వైద్యుడు!

Viral News: హాస్పిట‌ల్‌లో ఓ వైద్యుడు న‌గ్నంగా తిరుగుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని ఓ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో చోటుచేసుకుంది. 45 ఏళ్ల వైద్యుడు ఔరంగాబాద్‌లోని బిడ్కిన్ రూర‌ల్ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో ప‌నిచేస్తున్నాడు. ఇత‌నికి డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటు ఉండ‌డంతో ఇలా రాత్రి వేళ‌ల్లో సోయ లేకుండా న‌గ్నంగా హాస్పిట‌ల్ అంతా తిరుగుతున్న‌ట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వెంట‌నే స్పందించిన హాస్పిట‌ల్ డీన్ క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ జ‌రిపి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.