Dhoni: ర‌జినీ స్టైల్ కాపీ కొట్టాల‌నుకున్నా

Hyderabad: కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ(dhoni)కి చెన్నై(chennai) గ‌డ్డ‌పై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌(rajinikanth)కు ఉన్న ఫ్యాన్‌డం ధోనీకి కూడా ఉంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల‌లో భాగంగా.. రిపోర్ట‌ర్లు ధోనీని ఓ స‌ర‌దా ప్ర‌శ్న అడిగారు. ధోనీ న‌టించిన యాడ్స్‌లో ఆయ‌న ర‌జినీ న‌టించిన క‌బాలి సినిమాలోని స్టైల్‌ను కాపీ కొట్టిన‌ట్లు క‌నిపించారు. దీని గురించి రిపోర్ట‌ర్లు అడిగారు. ఇందుకు ధోనీ స్పందిస్తూ… “ర‌జినీ స‌ర్‌తో కంపేర్ చేయకండి. ఓ గొప్ప మ‌నిషికి ఉన్న గొప్ప స్టైల్‌ను కాపీ కొట్టాల‌నుకున్నాం. అంత‌కుమించి ఏమీ లేదు. ఆయ‌న స్థాయిని మ‌నం చేరుకోవ‌డం చాలా క‌ష్టం. క‌నీసం ఆయ‌న స్టైల్ అయినా కాపీ కొట్టాల‌నుకున్నా” అని తెలిపారు ధోనీ.