Kohli: అమ్మో కొడితే చ‌చ్చిపోతా..!

Hyderabad: రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(royal challengers banglore) టీం కెప్టెన్ విరాట్ కోహ్లీకి(virat kohli) కోపం ఎక్కువ‌. ఫీల్డ్‌లో అత‌ని కోపం చూడ‌ని క్రికెట‌ర్ ఉండ‌రంటే ఆశ్చ‌ర్యపోనక్క‌ర్లేదు. తిట్ట‌డం వ‌ర‌కేనా కొట్ట‌డం కూడానా? అని అడిగితే.. అమ్మో నాకంత సీన్ లేదు అంటున్నాడు కోహ్లీ. ఐపీఎల్ సీజ‌న్ నేప‌థ్యంలో క్రికెట‌ర్లు స‌ర‌దాగా ఇంట‌ర్వ్యూలో చిట్‌చాట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు కోహ్లీ ఫ‌న్నీగా ఆన్స‌ర్ ఇచ్చాడు. ఫీల్డ్‌లో కోహ్లీ కోపం చూసాం. తిట్ట‌డం కూడా చూసాం. మ‌రి కోహ్లీ కొడ‌తాడా? అని యాంక‌ర్ అడిగారు. దీనికి కోహ్లీ.. తిట్ట‌డం వ‌ర‌కు ఓకే. కానీ కొట్టుకోవ‌డం లాంటివి లేదు. చిన్న‌ప్ప‌టి నుంచి నేను గొడ‌వ‌లు పెట్టుకోలేదు. ఎందుకంటే వాళ్లు న‌న్ను కొడితే నేను చ‌చ్చిపోతా. అందుకే కొట్లాట‌లు లేవు. ఫీల్డ్‌లో ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిడ‌తా ఎందుకంటే ఎవ‌రైనా కొట్ట‌డానికి వ‌స్తే ఆప‌డానికి అంపైర్ ఉంటాడు అని ఫ‌న్నీగా ఆన్స‌ర్ ఇచ్చాడు కోహ్లీ. ఐపీఎల్ మ్యాచ్ నేప‌థ్యంలో బెంగ‌ళూరులో ఉన్న కోహ్లీ..స‌ర‌దాగా ఫ్యామిలీతో క‌లిసి లంచ్‌కు వెళ్లారు. భార్య అనుష్క శ‌ర్మ‌, అత్త‌మామ‌ల‌తో క‌లిసి కోహ్లీ స‌ర‌దాగా టైం స్పెండ్ చేసారు. వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగ‌బ‌డ్డారు.