Chahal: పెళ్లి చేసుకుందాం.. నో డేటింగ్ అని చెప్పా
Hyderabad: క్రికెటర్ల ఆటతీరే కాదు.. తమ పర్సనల్ విషయాలూ తెగ వైరల్ అవుతుంటాయి. ఐపీఎల్(ipl) సీజన్ జరుగుతున్న సమయంలో ఇండియన్ క్రికెటర్లు వీలు కుదిరినప్పుడల్లా చేస్తున్న చిట్ చాట్లు ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(chahal) తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. డ్యాన్సర్, యూట్యూబర్ ధనశ్రీతో చాహల్ పెళ్లైన విషయం తెలిసిందే. వీరిద్దరూ లాక్డౌన్లో కలుసుకున్నారు. చాహల్ ఆన్లైన్లో ధనశ్రీ డ్యాన్స్ క్లాసెస్ అటెండ్ అయ్యేవాడు. అలా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే ధనశ్రీనే చాహల్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. ఇదే విషయాన్ని ధనశ్రీతో కూడా అన్నట్లు చాహల్ తెలిపాడు. నేను ధనశ్రీతో ఆన్లైన్లో టచ్‌లో ఉన్నప్పుడు నాకు డేటింగ్ చేయాలని లేదు పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పాను. కానీ ధనశ్రీ లేదు ముందు కలవాలి అంది. అలా కలుసుకున్నాం. ఆ తర్వాత ధనశ్రీ పెళ్లికి ఓకే చెప్పింది అని తెలిపాడు చాహల్