Hyderabad: రిచెస్ట్ నగరం.. ఏ విధంగా అయ్యిందంటే?

hyderabad: ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో(world’s wealthiest cities 2023) హైదరాబాద్‌(hyderabad) చోటు దక్కించుకుంది. ఇక వంద వెల్తీయస్ట్‌ సిటీల్లోనూ భారత్‌ నుంచి నాలుగు నగరాలకు చోటు దక్కింది. ఇందులో ముంబై(mumbai) 21, ఢిల్లీ(delhi) 36, బెంగళూరు(bengaluru) 60, కోల్‌కతా(kolkata) 63, హైదరాబాద్‌ 65వ స్థానంలో నిలిచింది. ఇక ఈ సర్వేను హెన్లీ అండ్‌ పార్టనర్‌ సంస్థ(london based consultancy Henley & Partners) వారు నిర్వహించారు. ఆయా నగరాల్లో నివసిస్తున్న వారిలో అత్యధిక నికర సంపాదన ఉన్నవారిని పరిణనలోకి తీసుకున్నారు. అంటే.. బిలియనర్స్‌ను మాత్రమే కన్సిడర్‌ చేశారు. ఈ లెక్కన హైదరాబాద్‌లో దాదాపు 11 వేల మంది ఉన్నారని సంస్థ పేర్కొంది. మొదటి స్థానంలో న్యూయార్క్‌ సిటీ ఉంది.. ఇక్కడ మూడు లక్షలకుపైగా బిలియనర్స్‌ ఉన్నట్లు చెబుతున్నారు. తర్వాతి స్థానాల్లో జపాన్‌, శాన్‌ప్రాన్సిస్కో, లండన్‌, సింగపూర్‌, లాస్‌ఏంజల్స్‌, హాంకాంగ్‌, బీజింగ్‌, షాంగై, సిడ్నీ నగరాలు నిలిచాయి.

గతంలో పట్టణాలు అభివృద్ది చెందడం వల్ల గ్రామాల స్వరూపం మారిపోతుందని ఇది తిరోగమనానికి సూచికని అనేవారు. కానీ నిజానికి నగరీకరణ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అనేక మందికి ఉద్యోగాలు, ఉపాధి, ఇన్వోవేషన్స్‌కు అవకాశాలు వంటివి నగరాల్లో లభిస్తాయి. ఈ రకంగా రాష్ట్రానికి రెవెన్యూ కూడా పెరుగుతుంది. నగరీకరణ, పట్టణీకరణ అనేది ప్రోస్పరిటీ కింద చూడాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్‌ నగరం రెండు రకాలుగా అభివృద్ది చెందింది. ఒకటి ప్లానింగ్‌తో.. రెండోది… న్యాచురాలిటీ మరో కారణం. ఈ రెండు విషయాల్లో హైదరాబాద్‌ అనతికాలంలోనే ఆర్థికంగా ఎదిగింది.  హైదరాబాద్‌లో భౌగోళికంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీంతో ప్రశాంత జీవనానికి ఇది నాంది పలికింది. చారిత్రక కట్టడాలు టూరిజం అభివృద్దికి దోహదపడుతున్నాయి. ఐటీ కంపెనీలు ఇక్కడ విస్తరించడం.. వైద్య, విద్యలో కూడా నగరం ఎంతో అభివృద్ది చెందింది. హైదరాబాద్‌లో నివసిస్తున్నజనాభా కూడా కోటి దాటింది.. ఇది కూడా ప్రగతికి.. ఆర్థిక వనరులు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.