వడగాల్పులు.. ఆ దేశంలో 15,700 మరణాలు
Europe: వాతావరంలో మార్పులు, వడగాల్పుల(heat waves) కారణంగా ఒక దేశంలో ఏకంగా 15,700 మంది మృత్యువాతపడ్డారు(climate change). అది ఎక్కడో కాదు.. యూరప్‌లో(europe). అది కూడా కేవలం 2022లో ఈ మరణాలు నమోదైనట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(wmo) వెల్లడించింది. 2022లో గ్రీన్‌హౌజ్ గ్యాసులైన కార్బన్ డైయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ ఎక్కువగా విడుదల కావడంతో వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయని ఆ సంస్థ తెలిపింది. దాంతో వరదలు, వడగాల్పుల కారణంగా ప్రతి ఖండంలోని దేశాల్లో(ఇండియాతో పాటు) తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ నష్టం విలువ కొన్ని బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అంటార్క్‌టికా ఖండంలో ఎప్పుడూలేని విధంగా మంచు కరిగిపోతోందట. గ్రీన్ హౌజ్ గ్యాసులు ఇలాగే విడుదలైతే మున్ముందు అన్ని దేశాలు ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. 2022లో తూర్పు ఆఫ్రికాలో విపరీతమైన వరదలు, పాకిస్థాన్‌లో రికార్డుకు మంచి వర్షపాతం, చైనాలో మాడు పగిలిపోయేలా వడగాల్పులు ఈ వాతావరణ మార్పులకు సంకేతాలేనని అంటున్నారు. విపరీతమైన వేడి కారణంగా అడవుల్లో మంటలు చెలరేగి తగలబడిపోతున్నాయని తెలిపారు.