Harbhajan Singh: అవును ధోనీ ఒక్క‌డే గెలిపించాడు.. మేం కాదు క‌దా..!

Hyderabad: మాజీ టీమిండియా కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ (dhoni) వ‌ల్లే సాధ్యం అంటూ ట్వీట్ పెట్టిన ఓ నెటిజ‌న్‌కు క్లాస్ పీకాడు మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ (harbhajan singh). ఫైన‌ల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. దాంతో ధోనీ అభిమాని అయిన ఓ నెటిజ‌న్ ట్వీట్ చేస్తూ.. ధోనీ కెప్టెన్‌గా ఎంపికైన 48 రోజుల్లోనే ఎలాంటి అనుభ‌వం లేక‌పోయినా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆస్ట్రేలియాను ఓడించాడు అని అన్నాడు. దాంతో హ‌ర్భ‌జ‌న్‌కు ఒళ్లు మండింది. “అవును ఈ మ్యాచ్‌లు ఆడుతున్న‌ప్పుడు ఈ ఒక్క ధోనీనే ఆడాడు. మిగ‌తా 10 మంది ఏమీ ఆడలేదు క‌దా. ధోనీ ఒక్క‌డే వర‌ల్డ్ క‌ప్ కొట్టేసాడు క‌దా. విచిత్ర‌మేంటంటే.. వ‌రల్డ్ క‌ప్ గురించి హెడ్‌లైన్స్ వ‌చ్చిన‌ప్పుడు వేరే ఏ దేశం గెలిచినా ఆ దేశ ఆట‌గాళ్ల గురించి రాస్తారు. కానీ ఒక్క ఇండియా విష‌యంలో మాత్ర‌మే కేవ‌లం ధోనీ వ‌ల్లే విజ‌యం సాధ్య‌మైంద‌ని రాస్తారు” అని మండిప‌డ్డాడు.