ఆ డ్రెస్‌లో సెక్సీగా ఉంటావ్.. ప్రొఫెస‌ర్‌కు డీన్ వేధింపులు

Gurugram: ఓ లేడీ ప్రొఫెసర్ ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించినందుకు(molestation) ఓ కాలేజ్ డీన్ అరెస్ట‌య్యాడు. ఈ ఘ‌ట‌న గురుగ్రామ్‌లో(gurugram) చోటుచేసుకుంది. గురుగ్రామ్‌కు చెందిన ధీరేంద్ర కౌశిక్ యూనివ‌ర్సిటీలో ఫార్మాసూటిక‌ల్ డిపార్ట్‌మెంట్‌కు డీన్‌గా ప‌నిచేస్తున్నాడు. అదే యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న ఓ మ‌హిళ‌ను చాలా కాలంగా వేధిస్తున్నాడు. అస‌భ్య‌క‌ర‌మైన మాట‌లు మాట్లాడుతూ కామెంట్లు చేసేవాడు. “ఓసారి మీ ఆయ‌న లేన‌ప్పుడు హోట‌ల్‌కు రా. వెస్ట్రన్ డ్రెస్సుల్లో చాలా సెక్సీగా ఉంటావ్” అన్నాడ‌ట‌. దాంతో ఇలా చేస్తే బాగోదు అని చెప్పినందుకు ఇంకా రెచ్చిపోయాడు. ఇక త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసారు. గ‌త నెల‌లో ఎవ‌రూ లేని టైం చూసి ప్రైవేట్ పార్ట్స్ ట‌చ్ చేయాల‌ని చూసాడ‌ని షాకింగ్ విష‌యాలు పోలీసుల‌కు వెల్లడించారు. ఈ విష‌యాలు ఎవ‌రికైనా చెప్తే ఉద్యోగం నుంచి ట‌ర్మినేట్ చేయిస్తాన‌ని బెదిరించిన‌ట్లు పేర్కొన్నారు. దీని గురించి యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స్‌ల‌ర్‌కు కంప్లైంట్ చేయాల‌నుకుంటే ఆయ‌న క‌నీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని వాపోయారు. పెద్ద పెద్ద వాళ్ల‌తో త‌న‌కు క‌నెక్ష‌న్స్ ఉన్నాయ‌ని కంప్లైంట్ చేసినా ఎవ‌రూ త‌న‌ని ఏమీ చేయలేర‌ని డీన్ త‌న‌తో చాలా సార్లు అన్నార‌ని ప్రొఫెస‌ర్ కంప్లైంట్‌లో పేర్కొన్నారు.