Foxconn: తెలంగాణ‌లో రూ.1600 కోట్ల‌ పెట్టుబ‌డి.. 10 ల‌క్ష‌ల‌ ఉద్యోగాలు

Hyderabad: తెలంగాణ‌లో(telangana) యాపిల్ స‌ప్ల‌య‌ర్ ఫాక్స్‌కాన్(foxconn) 200 మిలియ‌న్ డాల‌ర్లు(రూ.1600 కోట్లు) ఇన్‌వెస్ట్ చేయ‌బోతోంది. దీని ద్వారా రానున్న ప‌దేళ్ల‌లో 10 ల‌క్ష‌ల ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మొద‌టి ద‌శ‌లో 35000 ఉద్యోగాలు రానున్నాయి. ఈ విష‌యాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. రంగారెడ్డి జిల్లాలోని కొంగ‌ర క‌లాన్ ప్రాంతంలో ఫాక్స్‌కాన్ ప్లాంట్ రాబోతోంది. ఈ పెట్టుబ‌డుల ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌ర‌ల్డ్ క్లాస్ ప్రొడ‌క్టుల‌ను మార్కెట్‌లో లాంచ్ చేయ‌డ‌మే ఫాక్స్‌కాన్ ల‌క్ష్య‌మ‌ని కంపెనీ అధినేత‌లు తెలిపారు. ఐఫోన్ల త‌యారీ సంస్థ‌ల్లో ఫాక్స్‌కాన్ అతిపెద్ద టెక్నాల‌జీ కంపెనీ. దీని హెడ్‌క్వార్ట‌ర్స్ తైవాన్‌లో ఏర్పాటుచేయ‌బ‌డింది. ఫాక్స్‌కాన్‌కు సంబంధించిన ఎక్కువ ప్లాంట్స్ అన్నీ చైనాలోనే ఉన్నాయి. అమెరికా, చైనా మధ్య ఉన్న అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల కార‌ణంగా ఇత‌ర దేశాల్లో త‌మ కంపెనీల‌ను స్థాపించి గ్లోబ‌ల్‌గా ఎద‌గాల‌ని ఫాక్స్‌కాన్ అభిప్రాయ‌ప‌డుతోంది. ఫాక్స్‌కాన్ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం 196 ఎక‌రాల భూమిని కేటాయించింది.