Twitter: మ‌స్క్ రాజీనామా.. ప‌గ్గాలు ఆమెకే!

Hyderabad: ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట‌ర్(twitter) సీఈఓగా ఎలాన్ మ‌స్క్(elon musk) రిజైన్ చేసారు. తన స్థానంలో ఓ మ‌హిళ రాబోతున్నార‌ని, 6 వారాల్లో ఆమె త‌న బాధ్య‌త‌ల‌ను స్వీక‌రిస్తార‌ని తెలిపారు. లాస్ట్ ఇయ‌ర్ దాదాపు 44 బిలియ‌న్ డాల‌ర్లు పెట్టి ట్విట‌ర్‌ను కొనుగోలు చేసిన మ‌స్క్.. ఇక దాన్ని భ‌రించ‌డం త‌న వ‌ల్ల కావ‌డంలేద‌ని ఇదివ‌ర‌కు ప్ర‌క‌టించారు. వ‌ర్క్ ఎక్కువ అయిపోతోంద‌ని, నిద్ర లేక ఆఫీస్‌లోనే ప‌డుకుంటున్నాన‌ని తెలిపారు. ఇక ట్విట‌ర్ సీఈవోగా NBC యూనివ‌ర్స‌ల్ ఎగ్జిక్యూటివ్ లిండా యాకారినో బాధ్య‌త‌లు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. కానీ లిండా నుంచి ఎలాంటి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న లేదు. ట్విట‌ర్ సీఈఓగా కొన‌సాగాలా వ‌ద్దా అని..త‌న ఫాలోవ‌ర్స్‌తో మ‌స్క్ ఓ స‌ర్వే నిర్వ‌హించారు. 57.5% మంది వ‌ద్దు అని స‌మాధానం ఇచ్చారు. వారి నిర్ణ‌యం ఆధారంగానే తాను సీఈఓగా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.