డ్రైవర్ లేకుండానే షాప్‌లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్!
డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ దానంతట అదే స్టార్ట్ అయ్య ఏకంగా ఓ షాప్‌లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజనూర్‌లో జరిగింది. బిజనూర్‌లోని ఓ షోరూంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో డ్రైవర్ లేడు. దానంతట అదే స్టార్ట్ అయ్యి ఎలా దూసుకెళ్లిందో తెలీక స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. షోరూంలోకి అద్దాలు పగలగొట్టుకుంటూ దూసుకురావడమే కాకుండా బయట పార్క్ చేసి ఉన్న బైకులు కూడా ధ్వంసమయ్యాయి. ట్రాక్టర్‌ను ఆపేందుకు షాపులోని క్యాషియర్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బయటనుంచి కూడా ఒక వ్యక్తి దీనిని ఆపేందుకు ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు దెయ్యం ట్రాక్టర్ నడిపిందేమో అంటూ ఫన్నీగా కామెంట్లు పెడున్నారు.
Amazing incident…
The tractor ran without a driver, broke the glass and entered the shoe showroom.
The viral CCTV video is from #Bijnor of #UP. pic.twitter.com/YUzTKEPFcA
— Jes Bhullar (@jesbhullar) March 2, 2023
” rel=”noopener” target=”_blank”>