రెస్టారెంట్ ప్రారంభించిన ఆవు..!
Lucknow: ఆవు రెస్టారెంట్ ప్రారంభించడం ఏంటి అనుకుంటున్నారా?(uttarpradesh) ఈ ఘటన నిజంగానే జరిగిందండీ. అది కూడా ఆవుల సంరక్షణకు పెద్దపీట వేసిన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీకి చెందిన శైలేంద్ర సింగ్ అనే వ్యక్తి డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తుండేవారు. సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులతో ఇబ్బందులు పడలేక ఉద్యోగానికి రిజైన్ చేసాడు. అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఆర్గానిక్ రెస్టారెంట్ ఓపెన్ చేసాడు. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్‌కు ఆవును తీసుకొచ్చారు. ఆవు చేతే రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. “నా దగ్గర ఉన్న ఆవులతో వాటి నుంచి వచ్చే మూత్రం, పేడలను ఎరువుగా వాడి కూరలు పండిస్తుంటాను. ఎలాంటి కెమికల్స్ వాడను. ఇలాంటి ఆర్గానిక్ రెస్టారెంట్ ఇప్పటివరకు యూపీలో రాలేదు. కల్తీ నూనెలు ఎక్కువ అవుతుండడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కెమికల్స్ లేకుండా సహజంగా పండించినవి తక్కువ ధరకే అమ్మాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపాడు. శైలేంద్ర ఆలోచనకు అందరూ మెచ్చుకుంటున్నారు. అందులోనూ పెద్ద పెద్ద సెలబ్రిటీలు, లోకల్ పొలిటీషియన్లను ప్రారంభోత్సవ కార్యక్రమాలకు పిలుస్తున్న ఈరోజుల్లో దైవంగా భావించే గోమాతతో రెస్టారెంట్ ప్రారంభించడం అభినందనీయం అని తెగ పొగిడేస్తున్నారు.