Lottery: 365 రోజుల పెయిడ్ లీవ్స్ గెలుచుకున్నాడు!
Beijing: లాటరీ(lottery)లో ఇప్పటివరకు కోట్లలో డబ్బులు గెలుచుకున్న ఘటనలు చూసాం. కానీ ఓ వ్యక్తి సెలవులను(leaves) గెలుచుకున్నాడు. అది కూడా పెయిడ్ లీవ్స్(paid leaves). ఈ అదృష్టం చైనీస్ వ్యక్తికి దక్కింది. చైనాకు చెందిన ఓ కంపెనీ ఏటా లక్కీ డ్రా నిర్వహిస్తుంటుంది. అందులో బోనస్‌లు, పెయిడ్ లీవ్స్ ఇలా ఎన్నో ఆఫర్లు ఉంటాయి. ఏడాది చివర్లో స్పెషల్ డిన్నర్ పార్టీ ఇచ్చి విన్నర్‌ను ప్రకటిస్తారు. అయితే గత మూడేళ్లలో కోవిడ్ కారణంగా లక్కీ డ్రాను నిర్వహించలేదు. దాంతో ఈ ఏడాది డిన్నర్ పార్టీలో వారం రోజుల క్రితం నిర్వహించారు. అయితే కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తికి ఈసారి లక్కీ డ్రా తగిలింది. ఆయనకు వచ్చిన ఆఫర్ ఏంటంటే.. 365 రోజుల పెయిడ్ లీవ్స్. అంటే 365 రోజులు సెలవు పెట్టినా కంపెనీ జీతం ఇచ్చేస్తుంది. దీనికి కంపెనీ బాస్ కూడా షాకయ్యారు. అయితే అతను కానీ ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటే మాత్రం త్వరలో అతని స్థానంలో మరో ఉద్యోగి ఉంటాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరమైతే కంపెనీ వివరాలు కావాలని, వేకెన్సీలు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు.