Vijayawada: చంపేసారా.. ఆత్మహత్యా..?
Vijayawada: 22 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యం కావడం విజయవాడ(vijayawada)లో సంచలనంగా మారింది. మృతుడు పెద్దపులిపాకకు చెందిన జీవన్(jeevan)గా గుర్తించారు. జీవన్ పొట్టిశ్రీరాములు కాలేజ్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. జీవన్ నిన్న రాత్రి శవమై కనిపించాడు. పోలీసులు ఆరా తీయగా.. అతని ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే నా చివరి రోజు అని రాసిన ఓ పోస్ట్ కనిపించింది. ఫ్రెండ్స్‌ని అడగ్గా.. నిన్న రాత్రి ఈ పోస్ట్ పెడితే ఊరికే పెట్టాడేమో అని వెక్కిరించామని, కానీ నిజంగానే శవమై కనిపిస్తాడని ఊహించలేదని అన్నారు. చెట్టంత కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే.. ఈఎంఐ కట్టమని ఇచ్చిన డబ్బులను సొంత ఖర్చులకు వాడుకున్నందుకు తండ్రి తిట్టాడని, ఆ బాధతో జీవన్ పెట్రోల్ పోసుకుని నిప్పింటించుకున్నాడని ఒక వాదన వినిపిస్తుంటే.. బర్త్‌డే పార్టీకి అని పిలిచి స్నేహితులే పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసారని మరో వాదన. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.