Wedding: ఈ పెళ్లి కూతురు.. ఎంత అదృష్ట‌వంతురాలో..!

Hyderabad: పై ఫొటోలో క‌నిపిస్తున్న జంట‌ను చూశారా?(wedding) ఎంతో చూడ‌ముచ్చ‌టగా ఉన్నారు క‌దా. ఇంత‌కీ వీరి క‌థేంటంటే..వీరి పేర్లు స‌తాక్షి, ప్ర‌తీక్. వీరిద్ద‌రికీ కొన్ని రోజుల క్రిత‌మే పెళ్లైంది. స‌తాక్షి ఫిజియో థెర‌పిస్ట్‌గా ప‌నిచేస్తోంది. పెళ్లి ఫిక్స్ అయిన కొన్ని రోజుల త‌ర్వాత ఆమెకు యాక్సిడెంట్ అయింది. దాంతో స‌తాక్షిని ఐసీయూలో పెట్టి చికిత్స చేసారు. అయితే ఈ విష‌యం తెలిసిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తీక్ ఆమె వెన్నంటే ఉన్నాడు. ఐసీయూలోనే త‌నకు కాబోయే భార్య‌కు సేవ‌లు చేసాడు. ఆమె పూర్తిగా కోలుకునేదాకా వెన్నంటే ఉన్నాడు. అలా స‌తాక్షి కోలుకున్నాక వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. స‌తాక్షికి కాలు నొప్పి పెడుతుందేమోన‌ని ఏడు అడుగులు వేసేట‌ప్పుడు కూడా ఆమెను ఎత్తుకుని న‌డిచాడు. అలా త‌న వెన్నంటే ఉండి ఇంత‌గా చూసుకున్న త‌న భ‌ర్త గురించి స‌తాక్షి చెప్తూ త‌న క‌థ‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో వీరి స్టోరీ కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ అమ్మాయి ఎంత అదృష్ట‌వంతురాలో అంటూ కామెంట్లు పెడుతున్నారు.