వేరొక‌డితో చాటింగ్.. బ‌ర్త్‌డే రోజే ప్రేయ‌సి హ‌త్య‌

Bengaluru: పుట్ట‌నరోజు(birthday) నాడే ప్రేయ‌సిని దారుణంగా చంపేసిన ఘ‌ట‌న బెంగ‌ళూరులో(bengaluru) చోటుచేసుకుంది. క‌న‌కాపుర‌ ప్రాంతానికి చెందిన ప్ర‌శాంత్ అదే ప్రాంతానికి చెందిన న‌వ్య‌తో ఆరేళ్లుగా ప్రేమ‌లో ఉన్నాడు. మంగ‌ళ‌వారం న‌వ్య బ‌ర్త్‌డే కావ‌డంతో గ్రాండ్‌గా పార్టీ ఇద్దామ‌నుకున్నాడు. కానీ వ‌ర్క్ కార‌ణంగా శుక్ర‌వారం పార్టీ చేసుకున్నారు. న‌వ్య కోసం స్పెష‌ల్‌గా కేక్ కూడా తెప్పించాడు. కేక్ క‌ట్ చేసిన త‌ర్వాత న‌వ్య‌కు ఓ వాట్సాప్ మెసేజ్ వ‌చ్చింది. కానీ న‌వ్య చూసి చూడ‌న‌ట్లు వ‌దిలేసింది. అప్ప‌టికే న‌వ్య వేరొక‌డితో చాటింగ్ చేస్తోంద‌న్న అనుమానం ప్ర‌శాంత్‌లో ఉంది. కేక్ క‌ట్టింగ్ త‌ర్వాత ఒక‌సారి వాట్సాప్ చాట్స్ చూపించాల‌ని ప్ర‌శాంత్ అడిగాడు. ఇందుకు న‌వ్య ఒప్పుకోలేదు. దాంతో త‌న అనుమానం నిజ‌మే అనుకుని క‌త్తితో న‌వ్య పీక కోసేసాడు. వెంట‌నే పోలీసులు ప్ర‌శాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.