Kerala: విహార‌యాత్ర విషాద‌మై..22 మంది మృతి

Kerala: కేర‌ళ‌లో(kerala) ఘోర బోటు ప్ర‌మాదం(boat accident) చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి మ‌ళ‌ప్పురం(malappuram) జిల్లాలోని తానూరు తీరం ద‌గ్గ‌ర బోటు మునిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 22 మంది మృతిచెందారు. మిస్స‌యిన వారి కోసం గాలింపులు జ‌రుగుతున్నాయి. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బోటులో 30 మంది కంటే ఎక్కువ ఉన్న‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్తున్నారు. పరిమితి కంటే ఎక్కువ మంది ఉన్నందునే ఈ ఘోరం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌యాణికులంతా విహార‌యాత్ర కోసం వ‌చ్చిన‌వారే అని, వారు ఎక్కిన బోటు టూరిస్టుల కోసం ఏర్పాటుచేసింద‌ని చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మృతుల కుటుంబాల‌కు 2 ల‌క్షల వ‌ర‌కు ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.