Modi వాహనంపై ఫోన్ విసిరిన BJP కార్యకర్త!
Mysuru: ఓ మహిళా బీజేపీ(bjp) కార్యకర్త అత్యుత్సాహం ఆమెని జైలు పాలుచేసింది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ(modi) మైసూరు(mysore)లో ప్రచారం చేస్తుండగా.. ఓ బీజేపీ కార్యకర్త(bjp worker) ఉత్సాహంతో ఆయన వాహనంపైకి ఫోన్ విసిరింది. వాహనం బానెట్‌పై ఫోన్ పడటంతో మోదీ దానిని గమనించారు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులకు ఏదో పడింది అన్నట్లు సైగ చేసారు. దాంతో పోలీసులు వెంటనే ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏదో ఉత్సాహంతో ఫోన్ విసిరినట్లు తెలీడంతో ఆమెను హెచ్చరించి ఆ ఫోన్‌ను ఆమెకు ఇచ్చేసారు.