Covid: మరో పదేళ్లలో కోవిడ్ లాంటి వైరస్!
Hyderabad: కోవిడ్(Covid) మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మళ్లీ జీవనశైలి ఇదివరకటిలాగే మారుతూ వస్తోంది. అయితే మున్ముందు ఉంది ముసళ్ల పండుగ అన్నట్లు.. మరో పదేళ్లలో ఇలాంటి మరో వైరస్(virus) రాబోతోందట. కోవిడ్ లాంటి మరో ప్యాండెమిక్(pandemic) వచ్చే అవకాశాలు 28% ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు, అధికం అవుతున్న అంతర్జాతీయ ప్రయాణాలు, పెరుగుతున్న జనాభా కారణంగా జూనాటిక్ వ్యాధులు సోకే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. లండన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. కొత్త వైరస్ వచ్చిన 100 రోజుల్లోపు వ్యాక్సిన్లు వస్తే అతి కొత్త మ్యూటెంట్‌లా మారకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయట.
వరస్ట్ కేస్‌లో బర్డ్ ఫ్లూ లాంటి వైరస్ కానీ మనిషి నుంచి మనిషికి సోకితే మాత్రం లండన్‌లో ఒక్కరోజే 15వేల మంది చంపేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చైనాలో H5N1 అనే బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగా మొదటి డెత్ కేస్ నమోదైంది. ప్యాండమిక్ వచ్చిన తర్వాత కంటే అది రాకముందే నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకునే పాలసీలు ఇంకా మెరుగవ్వాలని అంటున్నారు.