కష్టపడి పనిచేయండి.. బోనస్ ఆశించొద్దు..!
America: ఏ కంపెనీ అయినా ప్రొడక్టివిటీ కోసం కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు బోనస్(bonus) ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. కొన్ని కంపెనీలు అవి(bonus) కూడా ఇవ్వవు. అయినప్పటికీ ఉద్యోగులు జీతాలతోనే నిరంతరం కష్టపడుతుంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ సీఈవో తమ కంపెనీ ఉద్యోగులతో అన్న మాటలు ఇప్పుడు రచ్చకు దారితీసాయి. అమెరికాకు చెందిన ఆండీ అనే మహిళ మిల్లర్ నాల్ అనే ఫర్నీచర్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తోంది. మే నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి సేల్స్ టార్గెట్ గురించి మాట్లాడటానికి ఉద్యోగులతో మీటింగ్ పెట్టింది. మీటింగ్‌లో బోనస్‌ల టాపిక్ వచ్చింది. కంపెనీ ఉద్యోగుల్లో ఎవ్వరికీ ఇంకా బోనస్ రాలేదని అన్నారు. దీనికి ఆండీ స్పందిస్తూ..
“ఇలా బోనస్‌లు రాలేదని బాధపడుతూ కూర్చోకండి. దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచించవద్దు. కంపెనీకి 26 మిలియన్ డాలర్ల సేల్స్ ఎలా తీసుకురావాలో దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు బోనస్ రానంతమాత్రాన ఏం చేయగలం చెప్పండి” అనింది. దాంతో ఉద్యోగులు షాక్ అయ్యారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆండీ మాత్రం 6.4 మిలియన్ డాలర్లు బోనస్‌గా పుచ్చుకుందట. దాంతో ఇలాంటి సీఈఓలతో పనిచేయాల్సిన అవసరం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసారు. సోషల్ మీడియా మొత్తం ఈమె గురించి నెగిటివ్‌గా ప్రచారం చేసారు. దాంతో తప్పుతెలుసుకున్న ఆండీ అందరికీ క్షమాపణలు చెప్పింది. అయితే ఉద్యోగులకు రావాల్సిన బోనస్‌లు ఇచ్చారో లేదో మాత్రం తెలియరాలేదు.