Visa: ఇండియ‌న్స్‌కి గుడ్‌న్యూస్.. 10 ల‌క్ష‌ల వీసాలు

America: అమెరికా(america) వెళ్లాల‌ని క‌ల‌లు కంటున్న భార‌తీయుల‌కు శుభ‌వార్త‌. ఈ ఏడాది దాదాపు ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా వీసాలు(visa) జారీ చేయ‌నున్న‌ట్లు జో బైడెన్ (joe biden)ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అన్ని స్టూడెంట్ వీసాల ప్ర‌క్రియ‌ను స్టార్ట్ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. H1B, L వీసాలను జారీ చేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. అమెరికాకు చెందిన ప‌లు టెక్ కంపెనీలు ప్ర‌తి సంవ‌త్స‌రం ఉద్యోగుల‌ను ఎంపిక‌చేసుకోవ‌డానికి ఇండియా, చైనా వంటి విదేశాలపై ఆధార‌ప‌డ‌తారు. అలాంటివారిని H1B వీసాల ద్వారా ఎంపిక‌చేసుకుంటారు. ఒకేసారి ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా వీసాలు జారీ చేయాల‌నుకోవ‌డం అమెరిక‌న్ ప్ర‌భుత్వానికే రికార్డ్ అని అంటున్నారు. మొద‌టిసారి H1B, B 1(బిజినెస్), B 2(టూరిస్ట్) వీసాల‌కు అప్లై చేసుకున్నవారు కొన్ని నెల‌ల పాటు ఎదురుచూడాల్సి వ‌స్తోంది. ఇప్పుడు 60 రోజుల్లో వీసాలు జారీ చేసే ప్ర‌య‌త్నంలో అమెరిక‌న్ ప్ర‌భుత్వం ఉంది.