ప్రేయసి తండ్రిని ఇరికించాలని ప్లాన్.. సీఎంని టార్గెట్ చేసి..
Lucknow: ప్రేయసి తండ్రి పోరుపడలేక ఆయన్ని ఎలాగైనా ఇరికించాలని ప్లాన్ వేసాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్(uttarpradesh)లో చోటుచేసుకుంది. అమీన్ అనే 18 ఏళ్ల కుర్రాడు.. ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ వీరిద్దరినీ కలవనివ్వకుండా అమ్మాయి తండ్రి అడ్డుపడుతున్నాడు. దాంతో ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలని ప్లాన్ వేసాడు అమీన్. తన ప్రేయసి తండ్రి సజ్జద్ హుస్సేన్ ఫోన్ కొట్టేసాడు. ఆ ఫోన్ నుంచి 112కి ఫోన్ చేసాడు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(yogi adityanath)ను చంపేస్తానని బెదిరించాడు. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ నెంబర్‌ను ట్రేస్ చేసి అడ్రస్ కనుక్కున్నారు. అడ్రస్‌కు వెళ్లి కనుక్కోగా.. తన ఫోన్ రెండు రోజుల క్రితం పోయిందని సజ్జద్ పోలీసులకు తెలిపాడు. విచారణ చేయగా ఇదంతా అమీన్ పనే అని తెలిసింది. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని ఎలాగైనా తప్పుడు కేసులో సజ్జద్‌ను ఇరికించాలని ప్లాన్ వేసినట్లు అమీన్ పోలీసులకు తెలిపాడు. దాంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అమీన్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు.