జాబ్ ఆఫ‌ర్ ఇద్దామ‌నుకుంటే.. కంపెనీ బాస్‌కే షాకిచ్చింది!

Hyderabad: జాబ్స్(jobs) కోసం కంపెనీల నుంచి కాల్స్ వ‌చ్చిన‌ప్పుడు న‌చ్చితే అప్లై చేస్తాం లేదంటే లేదు. అయితే జాబ్ ఆఫ‌ర్(job offer) ఇస్తాన‌న్న ఓ కంపెనీ ఓన‌ర్‌కి ఓ యువ‌తి ఇచ్చిన ఆన్స‌ర్ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రోష‌న్ ప‌టేల్ అనే ఎన్నారై న్యూయార్క్‌లో వాల్న‌ట్ పేరుతో 2021లో స్టార్ట‌ప్ స్థాపించాడు. ఈ కంపెనీకి కొంత డ‌బ్బు పెట్టుబ‌డిగా వ‌చ్చింది. దాంతో కొంద‌రు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌ను హైర్ చేసుకోవాల‌ని అనుకున్నాడు. ఇందుకోసం న్యూయార్క్‌లోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తు ఓ అమ్మాయికి రోష‌న్ మెసేజ్ పెట్టాడు. హాయ్‌..నా స్టార్టప్ కంపెనీకి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలి. మీకు ఓకే అయితే మ‌నం జాబ్ గురించి చ‌ర్చించుకుందాం అని మెసేజ్ పెట్టాడు. ఇందుకు ఆ అమ్మాయి షాకింగ్ రిప్లై ఇచ్చింది. హాయ్ రోష‌న్.. నేను మీ కంపెనీ ప్రొఫైల్ చూసాను. మీకు ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఫండ్స్ కంటే నా జీత‌మే ఎక్కువ‌. అని రిప్లై ఇచ్చింది. దాంతో రోష‌న్ షాక‌య్యాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగి రెండేళ్లు అవుతున్నా ఇప్ప‌టికీ దీనిని మ‌ర్చిపోలేపోతున్నానంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసాడు రోష‌న్. దాంతో వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.