డబ్బు కోసం తొక్కిసలాట.. 85 మందికి పైగా మృతి
yemen: ఆర్థిక సాయం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో దారుణం చోటుచేసుకుంది. డబ్బు కోసం ఒకేసారి వందలాది(yemen) ప్రజలు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. దాదాపు 85 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఈ ఘటన యెమెన్(yemen)రాజధాని సనాలో చోటుచేసుకుంది. యుద్ధం కారణంగా అక్కడి ప్రజలు సర్వం కోల్పోయారు. తిండి నీరు లేక అల్లాడుతున్నారు. రంజాన్ సమయం కావడంతో ఇద్దరు వ్యక్తులు వారికి ఆర్థిక సాయం చేయాలనుకున్నారు. ఈ విషయం అందరికీ తెలీడంతో వందలాది జనం ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. దాదాపు 300 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. చనిపోయినవారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. శవాల పై నుంచే తొక్కుకుంటూ ఆర్థిక సాయం కోసం వెంపర్లాడారు. గత ఎనిమిదేళ్లుగా యెమెన్‌లో యుద్ధం జరుగుతోంది. 2014లో ఇరాన్ మద్దతుగల హుతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకోవడంతో యుద్ధం మొదలైంది. దాంతో సౌదీ అరేబియా కలగజేసుకోవాల్సి వచ్చింది. అప్పటినుంచి సౌదీ, ఇరాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండేళ్ల క్రితమే అంతా సర్దుమణిగినప్పటికీ యుద్ధం వల్ల నష్టపోయిన వారు ఇంకా పేదరికంలోనే బతుకుతున్నారు. గతేడాది సౌదీ, ఇరాన్ చర్చించుకుని ఓ శాంతీయుత ఒప్పందం చేసుకున్నాయి. సౌదీలో ఉన్న ఇరానీ ఖైదీలను, ఇరాన్‌లో ఉన్న సౌదీ ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాయి.