vladimir putin: చూపు సరిగ్గా లేదు.. నాలుకకు చలనం లేదు
రష్యా అధ్యక్షుడు(Russian president) వ్లాదిమిర్ పుతిన్(vladimir putin)కు అనారోగ్యానికి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఆయనకు కంటి చూపు తగ్గిపోయిందని, నాలుకకు చలనం లేదని పుతిన్ డాక్టర్ల టీం చెబుతున్నారు. పుతిన్ హెల్త్ రిపోర్ట్(health report)ను చూసి డాక్టర్లు వర్రీ అవుతున్నారట. గతేడాది రష్యా(russia), ఉక్రెయిన్(ukraine) మధ్య పుతిన్ యుద్ధం(war) ప్రకటించినప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయన చేతులు రంగు మారిపోయాయని అన్నారు. ఇప్పుడు ఆయన విపరీతమైన తలనొప్పి, కంటి చూపు కోల్పోవడం, నాలుకలో చలనం లేకపోవడం వంటి విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని జనరల్ ఎస్వీఆర్(SVR telegram channel) టెలిగ్రామ్ ఛానెల్లో ప్రచురితమైంది. గత కొన్ని నెలలుగా పుతిన్(putin) అనారోగ్యానికి సంబంధించిన ఈ టెలిగ్రామ్ ఛానెల్ నుంచే కథనాలు వెలువడుతున్నాయి. కుడి చెయ్యి, కాలులో పాక్షికంగా స్పర్శ కోల్పోయినట్లు చెబుతున్నారు. పుతిన్ (putin) టీంలోని డాక్టర్లు వెంటనే ఆయనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కొన్ని రోజుల పాటు మంచం దిగకూడదని చెప్పినట్లు సమాచారం. కానీ పుతిన్ మాత్రం రెస్ట్ తీసుకోనని, ఉక్రెయిన్‌తో యుద్ధానికి సంబంధించిన రిపోర్టులతో మీడియా ముందుకు వచ్చారట. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందట.
“పుతిన్(putin)కి ఏమవుతుందోనని అతని కుటుంబ సభ్యులు అనుక్షణం భయపడుతున్నారు. పుతిన్‌కు కాస్తంత నలతగా అనిపించినా వారు తట్టుకోలేకపోతున్నారు. అతనికి ఏమన్నా జరిగితే వారి పరిస్థితి ఏంటా అన్న అయోమయంలో ఉన్నారు” అని టెలిగ్రామ్ ఛానెల్లో పేర్కొంది.