tirumala: ఆలయ పరిసరాల్లో మూడు హెలికాఫ్టర్ల చక్కర్లు
tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరిన శ్రీవారి ఆలయం పరిసరాల్లో మంగళవారం సాయంత్రం వేళ.. మూడు హెలికాప్టర్లు(helicopters) చక్కర్లు కొట్టడం భక్తులను ఆందోళనకు గురి చేసింది. శ్రీవారి(tirumala temple) ఆలయానికి సమీపంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్ ప్రాంతంలో హెలికాప్టర్లు సంచరించినట్టు అధికారులు గుర్తించారు. తిరుమలలో మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై టీటీడీ విజిలెన్స్(ttd vigilance) విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్(air force)కు చెందిన హెలికాప్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల ఉపరితలంలో చక్కర్లు కొట్టినట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సబంధించి పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తిరుమల భద్రత దృష్ట్యా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి విమానాలు, హెలికాఫ్టర్లు సంచరించకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఈక్రమంలో ఏకంగా మూడు హెలికాఫ్టర్లు తిరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది ఇలా ఉండగా.. గతంలో కూడా డ్రోన్‌తో తిరుమల పరిసరాలను, గర్భగుడిని వీడియో తీయడం.. అది సామాజిక మాధ్యమాల్లో బయటకు రావడంతో.. ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తాజాగా ఇప్పుడు హెలికాఫ్టర్ల సంచారం చోటుచేసుకుంది.