Rains: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన.. రోడ్లన్నీ జలమయం!
vijayawada: హైదరాబాద్ నగరం(hyderabad city)లో ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం(heavy rain) కురిసింది. పొద్దున్నే ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. భారీ వర్షంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లితో సహా.. నగరంతోపాటు శివారు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపించింది. మరోవైపు వడగండ్ల వాన పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు, వడగండ్ల వాన పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్(orange alert)ప్రకటించారు.
ఏపీలో పరిస్థితి ఇలా..
ఏపీ(ap)లోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణశాఖ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మరో నాలుగు రోజులు వానలు పడతాయి అంటున్నారు. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని.. చెట్ల కింద ఉండొద్దని.. రైతులు, గొర్లె కాపర్లు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శనివారం ఉత్తరాంధ్రతో పాటూ కోస్తా, రాయలసీమలకు వర్ష సూచన చేసిన వాతావరణశాఖ. మరోసారి వానలు పడతాయన్న అంచనాతో రైతుల్లో ఆందోళన నెలకొంది.