Terror Attack: హైద‌రాబాద్‌లో ఉగ్ర‌కుట్ర భ‌గ్నం.. 5 అరెస్ట్

Hyderabad: దేశంలో ఉగ్రకుట్రకు(terror attack) ప్రణాళికలు రచిస్తున్న హెచ్‌యూటీ(Hizb-Ut-Tahrir) సానుభూతిపరులను పోలీసులు గుర్తించారు. కుట్రకు ప్లాన్‌ చేస్తుండగా.. మధ్యప్రదేశ్‌లో 11 మంది, హైదరాబాద్‌లో 5గురు, భోపాల్‌లో ఒకరిని అరెస్టు చేశారు. అయితే.. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌ మరోసారి వార్తలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం ఈ బృందంలో 17 మంది వరకు ఉండగా.. అందరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఇక వీరితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి. ఈ బృందం ఎంతమందికి శిక్షణ ఇచ్చింది.. వారి పూర్తి ప్రణాళిక ఏంటి అన్నదానిపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది.

ఉగ్రకుట్రలో భాగంగా తొలుత భోపాల్ కి చెందిన యాసిర్ అనే వ్యక్తి.. హైదరాబాద్ కు ఆరుగురిని పంపించారు. అందులో సలీం అనే వ్యక్తి.. విద్యావంతుడు. వేరే వ్యక్తి రిఫరెన్స్‌తో ఆయన హైదరాబాద్‌లోని డక్కన్ కాలేజీలో హెచ్‌వోడీగా చేరారు. మిగిలిన వారు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇక సలీం మెడికోలను ట్రాప్ చేసేందుకే అక్కడ చేరినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్లుగా.. సలీం స్థానికంగా ఉంటూ.. సూసైడ్ బాంబర్స్, గ్రెనేడ్ దాడులు, కెమికల్స్ దాడులపై ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. బయాన్ పేరుతో వీరు మీటింగ్స్ కూడా నిర్వహించారని గుర్తించారు. మీటింగ్స్ కి ఎవరెవరు వెళ్లారనే వివరాలున ఇప్పుడు రాబడుతున్నారు. డక్కన్ కాలేజ్ హెచ్ఎడీగా ఉన్న సలీం ఇంట్లోనే మీటింగ్స్ ఎక్కువగా జరిగేవని గుర్తించారు. ఇక నిందితుల కాంటాక్ట్స్, సోషల్ మీడియా డేటాపై ఇన్వెస్ట్ గేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు. టెర్రర్ లింక్స్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది.