Telangana: రేపే ఇంటర్​ ఫలితాలు!

Hyderabad:  తెలంగాణ ఇంటర్‌ ఫలితాల(Telangana Results) వెల్లడిపై ఇంటర్‌ బోర్డు కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఇప్పటికే ఏపీ ఇంటర్(AP Inter), పది ఫలితాలు(SSC Results) విడుదలైన విషయం తెలిసిందే.  తెలంగాణలో పది, ఇంటర్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. తెలంగాణ ఇంటర్​ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) ప్రకటించారు. నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ ఫలితాలు విడుదలైన తర్వాత ఒక వారం వ్యవధిలో పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. అంటే మే 15వ తేదీలోపు పదో తరగతి ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 04 వరకు జరిగాయి.
విద్యార్థులు ఇంటర్ ఫ‌లితాల కోసం tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్​లో చూడవచ్చు.