summer heat: మండుతున్న ఎండలు… పొంగుతున్న బీర్లు!
hyderabad: తెలుగు రాష్ట్రల్లో(telugu states) ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగలు ఉష్ణోగ్రతలు సరాసరి 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ లోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే.. ఇక మే లో ఏవిధంగా ఉంటుందో అర్థం అవుతోంది. ఇది ఇలా ఉంచితే.. అసాధారణంగా పెరుగుతున్న ఎండలు తెలుగు రాష్ట్రాల వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా… మందుబాబులు(alcoholics) మాత్రం సాయంత్రానికి చిల్ అవుతున్నారు. ఎండలు పెరుగుతున్న తరుణంలో వారి చూపు బీర్లపై పడింది. ఫలితంగా ఈ నెలలో బీర్ల అమ్మకాలు(beers sales) ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ నెల 1 నుంచి 17 వరకు హైదరాబాద్ నగరంలో ఏకంగా 1.50 లక్ష ల బీర్లు అమ్ముడైనట్టు ఆబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నట్టు ఆబ్కారీ శాఖ పేర్కొంది.
ఈ మూడు జిల్లాల్లో కలిపి ఈ నెల 17 వరకు మొత్తం 8,46,175 కేసుల బీర్లు అమ్మడుపోయాయని.. ఒక్కో కేసులో 12 బీర్లు ఉంటాయి. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం 10,154,100 బీర్లు అమ్ముడుపోయాయి. అదేవిధంగా ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో బీర్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. నెలకు సగటున లక్ష బీరు కేసులు అదనంగా అమ్ముడవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఏపీలోనూ అలాంటి పరిస్థితే ఉంది.. ఇక్కడ కూడా ఎండలు తీవ్రంగా ఉండటంతో మందుబాబులు… బీర్లు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇలా బీర్లు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయినా వాటిని మందుబాబులు పట్టించుకోవట్లేదు.