Salman khan: 30న చంపేస్తామంటూ బెదిరింపులు
Mumbai: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (salman khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈసారి రాజస్థాన్ (rajasthan)కు చెందిన ఓ మైనర్ ఈ బెదిరింపులకు పాల్పడటం గమనార్హం. ముంబైలో తన కొత్త సినిమా కిసీకా భాయ్ కిసీకీ జాన్ (kisika bhai kisiki jaan) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లినరోజే ఈ బెదిరింపులు వచ్చాయి. ఏప్రిల్ 30న సల్మాన్‌ని చంపుతామని ఓ మైనర్ బెదిరించాడట. ఈ మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. విచారణ చేపడుతున్నారు. నిందితుడు రోకీ భాయ్ అనే మైనర్‌గా గుర్తించారు. గత నెలలో కూడా 21 ఏళ్ల యువకుడు సల్మాన్‌ను చంపుతానని బెదిరించాడు. అతన్ని ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
సల్మాన్ బ్లాక్‌బక్‌లను(blackbuck case) వేటాడిన కేసులో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన లారెన్స్ బిష్ణోయ్(lawrence bishnoi) అనే గ్యాంగ్‌స్టర్ సల్మాన్‌ను టార్గెట్ చేసాడు. సల్మాన్ సారీ చెప్పకపోతే చంపుతానని బెదిరించాడు. దాంతో ముంబై పోలీసులు సల్మాన్‌కు సెక్యూరిటీ ఇచ్చారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సల్మాన్ ఏర్పాటు చేయించుకున్నాడు. 1998 బ్లాక్‌బక్ కేసులో భాగంగా జోధ్‌పూర్ హైకోర్టు సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ ఐదేళ్లు జైలు శిక్ష వేసింది. జోధ్‌పూర్ సెంట్రల్ జైలు(jodhpur central jail)లో రెండు రోజులు ఉన్న సల్మాన్ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చేసాడు. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి.