sabarimala airport: నిర్మాణానికి కేంద్రం అనుమతులు

kerala: కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో విమానాశ్రయ(sabarimala airport) నిర్మాణానికి కేంద్రం(central government) అనుమతులు జారీ చేసింది. కొట్టాయం(kottayam) జిల్లాలోని చెరువల్లి ఎస్టేట్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఇందు కోసం 2,266 ఎకరాలు కేటాయించడంతోపాటు అదనంగా 307 ఎకరాల భూమిని సేకరించనున్నారు. విమానాశ్రయం నిర్మాణం పూర్తైతే.. 3.5 కి.మీ పొడవుతో రాష్ట్రంలోనే అత్యంత పొడవైన విమానాశ్రయంగా నిలవనుంది. ఈ విమానాశ్రయం పూర్తయితే శబరిమలకు ప్రయాణ సమయం తగ్గనుంది. విమాన సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఎంతో మంది భక్తులకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.