mosquito coil: మరొకరిని సజీవదహనం చేసింది!
vijayawada: ఇటీవల ఢిల్లీ(delhi)లో మస్కిటో కాయిల్(mosquito coil) పొగను పీల్చడంతో సుమారు ఆరుగురు కుటుంబ సభ్యులు చనిపోయిన సంఘటన చోటుచేసుకుంది. దీన్ని మరువక ముందే.. తాజాగా.. చిత్తూరు(chittoor )కు చెందిన ఓ వ్యక్తి.. మస్కిటో కాయిల్‌కు బలయ్యాడు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దోమలు బెడద ఎక్కువగా ఉందని భావించిన అతను.. వాటి నుంచి తప్పించుకునేందుకు మస్కిటో కాయిల్ వెలిగించుకున్నాడు. దాన్ని పక్కనే పెట్టుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మస్కిటో కాయిల్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగగా.. నిరంజన్(niranjan) (46) అనే వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఈ ఉదంతం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, మార్లపల్లిలో చోటుచేసుకుంది.
ఉదయాన్నే ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు… వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. మంటలు, పొగలను అదుపుచేసి.. లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే నిరంజన్ డెడ్ బాడీ సగం కాలిపోయి ఉందని పోలీసులు గుర్తించారు. నిరంజన్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దోమలను తరిమివేసేందుకు పేద ప్రజలు మధ్య తరగతి వారు వినియోగిస్తున్న మస్కిటో కాయిల్ ప్రాణాలమీదకు తెస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.