Botsa: ఉత్తరాంధ్రపై చంద్రబాబుకి కడుపు మంట!
vijayawada: ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణంలో అభివృద్ధి పనులుకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి(cm ys jagan mohan reddy) శంకుస్థాపనలు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ(minister botsa satyanarayana) అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉన్న తరుణంలో కొందరు తట్టుకోలేకపోతున్నారని.. ప్రధానంగా.. చంద్రబాబునాయుడు(tdp chief chandrababu naidu), ఆయన్ను భుజాన ఎత్తుకున్న ఈనాడు రామోజీరావు(eenadu ramoji rao)కు కడుపుమండుతోందన్నారు. దాని తాలూకూ దురద్దేశాన్ని వారి పత్రిక, టీవీ ఛానెళ్ల కథనాల ద్వారా ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ఏ పనిచేసినా.. ఏం చెప్పినా కూడా రాజకీయలబ్ధి కోసమే తప్ప ప్రజాప్రయోజనార్ధం ఎప్పుడూ చేయలదని బొత్స మండిపడ్డారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం మూడు ప్రాంతాలకు సమీపంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భోగాపురాన్ని ఎంపిక చేశాక, దాన్ని ప్రభుత్వం ఆమోదించి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తుంటే.. అక్కడ ప్రాంత ప్రజలంతా ఆనందంగా ఉన్నారని… చంద్రబాబుకు, రామోజీరావుకు ఎందుకు కడుపుమంటతో రగిలిపోతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.
ఎయిర్‌పోర్టు భూసేకరణకు సంబంధించి కూడా, ఈ ప్రాంత రైతులతో రోజువారీ సమావేశాలు పెట్టి అందరితో మాట్లాడామని.. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధిగా, మంత్రిగా తాను రైతు సమావేశాల్లో పాల్గొన్నానన్నారు. అందరినీ మెప్పించాం, ఒప్పించాం కాబట్టే.. ఇవాళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మరి ఆనాడు బాబు హయాంలో ఎందుకు ఆ దిశగా అడుగులు వేయలేదని ప్రశ్నించారు. జగన్ నాడు నేడు ఒకే నోరుతో మాట్లాడుతున్నారని.. చంద్రబాబులా.. నాలుగు నాలుకలతో, బాబుకు మద్ధతుగా మీరంతా నాలుగైదు నోళ్లతో మాట్లాడినట్లు తమ నాయకుడు వ్యహరించడం లేదన్నారు. బాబు 12వేల ఎకరాలు కావాలంటే.. మేం 2300కు కుదించామని.. రైతులకు నిజాలను చెప్పే ఒప్పించామన్నారు.