medico preethi death: ప్రీతీది హత్య కాదు.. ఆత్మహత్యే వరంగల్‌ సీపీ!

warangal: వరంగల్‌లో వైద్య విద్యార్థిని ప్రీతి (medico preethi suicide) ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో(telugu states) సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి.. ప్రీతి మృతికి కారణమైన ఆమె సీనియర్‌ విద్యార్థి సైఫ్‌(saife)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ప్రస్తుతం ప్రీతి పోస్టుమార్టం రిపోర్టు పోలీసులకు చేరింది. ఈ సందర్బంగా వరంగల్‌ సీపీ రంగనాథ్‌(warangal Cp ranganath) మీడియా(press meet)తో మాట్లాడారు. ప్రతీ పోస్టుమార్టం రిపోర్టు(post mortem report) ప్రకారం ఆమెది ఆత్మహత్య అని హత్య కాదని పేర్కొన్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం సైఫే అని తేల్చారు. అతని వేధింపుల వల్లనే ప్రీతి పాయిజన్ తీసుకుందని పోలీసులు తేల్చారు. ఈ కేసుపై మరో వారం, పదిరోజుల్లో చార్జ్‌షీటు దాఖలు చేస్తామని సీపీ తెలిపారు.

ఇక ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు.. మహ్మద్‌ సైఫ్‌కు బెయిల్‌ లభించింది. రెండు నెలలుగా ఖమ్మం జిల్లా జైలులో రిమాండులో ఉన్న సైఫ్‌కు బుధవారం (ఏప్రిల్ 19న) షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. సాధారణ కోర్టు వాయిదా ఉండడంతో సైఫ్‌ని పోలీసులు గురువారం (ఏప్రిల్ 20న) వరంగల్‌ కోర్టులో హాజరుపరిచారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య 16 వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని న్యాయమూర్తి సూచించారు. మృతురాలి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేస్తే.. బెయిల్‌ రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు.