Lyca Productions: లైకా నిర్మాణ సంస్థ‌పై ఈడీ రైడ్స్

Chennai: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్(lyca productions) హౌజ్‌పై ఈడీ రైడ్లు జ‌రుగుతున్నాయి. చెన్నైలోని ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌కు ఈడీ అధికారులు చేరుకుని రైడ్స్ చేస్తున్నారు. రోబో, పొన్నియిన్ సెల్వ‌న్, రాంగి, భార‌తీయుడు-2 వంటి ఎన్నో ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాల‌ను తెర‌కెక్కించిన సంస్థ లైకా. రైడ్ల‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.