Vizag: దూసుకొచ్చిన కారు.. మహిళ మృతి

Vizag: విశాఖప‌ట్నంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. మద్దెలపాలెం, హెచ్‌బీ కాలనీ నుంచి రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన కారు ఒక షాప్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జగదీశ్వరి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవరు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.