eid ul fitr: నెలవంక కనిపించే.. రంజాన్ పండుగ వచ్చే!
delhi: భారత్‌లో ముస్లింలకు శుభవార్త.. శుక్రవారం నెలవంక కనిపించింది. దీంతో శనివారం ఈద్ ఉల్ ఫితర్ (eid ul fitr) పండుగ నిర్వహించుకోవచ్చని సెంట్రల్ రుయత్ ఈ హిలాల్ కమిటీ (the central ruet e hilal committee) ప్రకటించింది. ఇక న్యూఢిల్లీ, లక్నో, శ్రీనగర్, జైపూర్, హైదరాబాద్‌తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో రంజాన్ పండుగ (ramzan eid) సందడి మొదలైంది. ముస్లిం సోదరులు పెద్దఎత్తున మార్కెట్లకు వెళ్లి కొనుగోళ్లు జరుపుతుండటంతో… హైదరాబాద్‌లోని పాతబస్తీ సందడిగా మారింది. ఇక తెలంగాణలో 24 గంటలు మార్కెట్లు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం ఇటీవల అనుమతులు ఇచ్చింది. దీంతో మహిళలు సైతం రాత్రివేళ షాపింగ్ కోసం క్యూ కడుతున్నారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన వారు నేడు విరమించనున్నారు. వాస్తవానికి ఇవాళే రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రార్థనలు కూడా చేశారు. శనివారం బంధుమిత్రులతో కలిసి రంజాన్ పండుగ జరుపుకునేందుకు సిద్ధమౌతున్నారు. ఇక గల్ఫ్ దేశాల్లో గురువారమే నెలవంక కనిపించడంతో.. వారు శుక్రవారం రంజాన్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఉదయం నుంచే ముస్లింలు పెద్దఎత్తున ఒకచోట చేసి భక్తిశ్రద్దలతో సామూహిక ప్రార్థనలు చేయనున్నారు.