Covid: హైద‌రాబాద్‌లో ఒక్క‌రోజే 12 కేసులు

Hyderabad: కోవిడ్ (Covid) మ‌హ‌మ్మారి ఇంకా వెళ్లిపోలేదు. ఇప్పుడిప్పుడే భార‌త‌దేశంలో (India)మళ్లీ పాగా వేస్తోంది. ఇప్ప‌టికే భార‌త‌దేశం మొత్తం దాదాపు 30 వేల‌కు పైగా కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్లడించింది. కాగా.. హైద‌రాబాద్‌లో(Hyderabad) కూడా కోవిడ్ కేసులు(covid cases) పెరుగుతున్నాయ్‌. నిన్న‌టికి కొత్త‌గా 12 కేసులు వ‌చ్చాయి. ఈ ర‌కంగా చూసుకుంటే హైద‌రాబాద్‌లో కేసులు పెర‌గ‌డంలో ఇదే రికార్డు. ఇక తెలంగాణ(Telangana) వ్యాప్తంగా 25 జిల్లాల్లో కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌స్తుతం కోవిడ్ కేసుల(covid cases) సంఖ్య 40కు చేరింది. తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా 6,813 టెస్టులు నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు 19 పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారు. 196 మంది హాస్పిట‌ల్స్‌లో చికిత్స పొందుతున్నారు. రిక‌వ‌రీ రేటు 99.49 శాతం ఉండ‌టంతో ప్ర‌జ‌లు భాయాందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అధికారులు చెబుతున్నారు. కానీ త‌గిన జాగ్ర‌త్త‌లు మాత్రం త‌ప్ప‌నిస‌రి.