Viveka murder case: వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
Pulivendula: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి(viveka murder case) హత్య కేసు దర్యాప్తును CBI వేగవంతం చేసింది. ఈరోజు ఉదయం ఎంపీ అవినాశ్ రెడ్డి(avinash reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని(ys bhaskar reddy) అరెస్ట్ చేసింది. హత్యకు రెండు రోజుల ముందు భాస్కర్ రెడ్డి(bhaskar reddy).. నిందితులతో ఫోన్లో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయని సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో పులివెందులలో ఉద్రిక్తత నెలకొంది. దాంతో YSRCP శ్రేణులు అరెస్ట్‌ను ఖండిస్తూ ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. పులివెందుల ఆర్టీసీ సర్కిల్ నుంచి పులంగల్లు వరకు ర్యాలీలు చేపట్టనున్నారు. ఎక్కడికక్కడ దుకాణాలు మూసేస్తున్నారు. భాస్కర్ రెడ్డిని పులివెందుల నుండి హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం భాస్కర్‌రెడ్డిని కోర్టులో ప్రవేశపెడతారు. 120B కుట్ర, 302 హత్య, 201 ఆధారాలు ట్యాంపరింగ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.