Delhi స్కూల్‌కు బాంబు బెదిరింపు

Delhi: దిల్లీ స్కూల్‌కు బాంబు(bomb scare) బెదిరింపులు వ‌చ్చాయి. ద‌క్షిణాది దిల్లీలోని(delhi) ఇండియ‌న్ ప‌బ్లిక్ స్కూల్‌కు ఈరోజు ఉద‌యం ఓ ఈమెయిల్ వ‌చ్చింది. స్కూల్‌లో బాంబు పెట్టిన‌ట్లు ఆ మెయిల్‌లో రాసి ఉంది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన యాజ‌మాన్యం పిల్ల‌ల‌ను, టీచ‌ర్ల‌ను బ‌య‌టికి పంపించి బాంబ్ స్వ్కాడ్‌ను పిలిపించారు. ఇప్ప‌టివ‌ర‌కు స్కూల్‌లో కానీ ప‌రిస‌రాల్లో కానీ ఎలాంటి పేలుడు ప‌దార్థాలు దొర‌క‌లేద‌ని అధికారులు తెలిపారు.