Bangladesh Protest: బంగ్లా అల్ల‌ర్లు.. T20 ప్ర‌పంచ క‌ప్ లేన‌ట్లేనా?

will there be t20 women world cup tournament in bangladesh

Bangladesh Protest: ప్ర‌స్తుతం బంగ్లాదేశ్‌లో జ‌రుగుతున్న అల్ల‌ర్ల నేప‌థ్యంలో టీ20 మ‌హిళా ప్ర‌పంచ క‌ప్‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. అక్టోబ‌ర్ 3 నుంచి 20 వ‌ర‌కు జ‌ర‌గాల్సిన టీ20 మ‌హిళల ప్ర‌పంచ క‌ప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యం వ‌హించాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇది సాధ్య‌మ‌వుతుందా లేదా అనేది తెలియడం లేదు. బంగ్లాదేశ్‌లో అల్ల‌ర్లు త‌గ్గ‌క‌పోతే ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌ను వేరే దేశానికి మార్చే యోచ‌న‌లో ఉంది అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.

ఇప్ప‌టికే ICC బంగ్లాదేశ్ క్రికెట్ కౌన్సిల్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. రెండు వార్మ‌ప్ మ్యాచ్‌లు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జ‌ర‌గాల్సి ఉన్నాయి. మొత్తం 23 మ్యాచ్‌లో ప‌ది టీమ్స్ ఆడ‌నున్నాయి. ఈ మ్యాచ్‌ల‌న్నీ బంగ్లాదేశ్‌లోని ఢాకా, సిల్హెట్ ప్రాంతాల్లో జ‌ర‌గాల్సి ఉన్నాయి. గ్రూప్ ఏలో ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక‌, ఆస్ట్రేలియా ఉన్నాయి. గ్రూప్ బిలో బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్ట్ ఇండీస్, స్కాట్‌ల్యాండ్ ఉన్నాయి.