Rohit Sharma: వరల్డ్ కప్‌లో రోహిత్‌ను వద్దన్న ధోనీ
Rohit Sharma: 2011 ODI వరల్డ్ కప్ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ.. రోహిత్ శర్మను వద్దన్నాడట. అలా 2007, 2009, 2010 ప్రపంచ కప్‌లలో ఆడిన రోహిత్ 2011 కప్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. 2011 ODI ప్రపంచ కప్ సమయంలో సెలెక్టర్ల మీటింగ్ జరుగుతుండగా రోహిత్ శర్మను తీసుకుందాం అని అన్నారట. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. రోహిత్ వద్దని అతని స్థానంలో పీయూష్ చావ్లాను తీసుకుందామని సలహా ఇచ్చాడు.
ఈ విషయాన్ని మాజీ ఇండియా సెలెక్టర్ రాజా వెంకట్ వెల్లడించారు. 2013 తర్వాత రోహిత్ ODIలలో కీలక ఆటగాడిగా పేరుగాంచాడు. అలా 2017లో వైస్ కెప్టెన్ అయ్యాడు. ఇక జూన్‌లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో రోహిత్ టీం ప్రపంచ కప్ గెలిచి 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ సేన సన్నద్ధమవుతోంది.