MS Dhoni: టీమిండియా కోచ్ పదవికి ధోనీ ఎందుకు అర్హుడు కాదు?
MS Dhoni: టీమిండియా కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ జూన్‌లో తప్పుకోనున్నారు. ఆయన పదవీ కాలం జూన్‌తో ముగుస్తుండడంతో బీసీసీఐ కొత్త టీమిండియా కోచ్ కావలెను అనే ప్రకటన వేసింది. మొన్న సోమవారంతో అప్లికేషన్ల గడువు ముగిసింది. ఇప్పటివరకు 3000 అప్లికేషన్లు వచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ పదవి చేపట్టేందుకు గౌతమ్ గంభీర్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
అయితే.. టీమిండియా కోచ్ పదవికి ఎంఎస్ ధోనీ కూడా అర్హుడే. కానీ ఆయన్ను ఎందుకు బీసీసీఐ ఈ పదవికి సంప్రదించలేదు? దీని వెనుక బలమైన కారణం ఉంది. 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో ధోనీ టీమిండియా కోచ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో టీమిండియా ప్రదర్శన ఏమీ బాగోలేదు. మరో విషయం ఏంటంటే.. కోచ్ పదవి చేపట్టాలంటే.. ఆ క్రికెటర్ ఏ ఫార్మాట్లలోనూ ఆడుతూ ఉండకూడదు. కానీ ధోనీ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నారు. కాబట్టి ఆయన్ను ఎంపిక చేయలేని పరిస్థితి.