CSK vs GT: నేటి మ్యాచ్‌లో పిచ్ ఎవరికి అనుకూలం?
CSK vs GT: చెపాక్‌లో ఇవాల్టి వాతావరణం ఆటకు అనువుగా ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సీజన్‌లో చెపాక్‌లో ఇది రెండో మ్యాచ్. RCBతో (Royal Challengers Banglore) జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించినప్పటికీ.. CSK (Chennai Super Kings) పేసర్ ముస్తాఫిజుర్ అనూహ్య స్వింగ్‌ను పొందాడు. సహజంగా ఛేదనకు అనుకూలించని ఈ పిచ్‌పై CSK 174 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. దీన్ని బట్టి చూస్తే ఈ పిచ్‌పై తొలుత బౌలింగ్ చేసే జట్టుకు ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. సొంత మైదానంలో ఆడనుండటంతో ఈ మ్యాచ్‌లో CSKకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి.