SRH vs MI: బోణీ కొడ‌తారా? హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయ్‌?

SRH vs MI: IPL2024లో భాగంగా ఈ రోజు SRH – MI జట్ల మధ్య పోరు జరగనుంది. కాగా, ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచుల్లో ఓడిపోగా, నేడు ఎలాగైనా విజయం సాధించి బోణీ కొట్టాలని తహతహలాడుతున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

రెండు జట్లకి కెప్టెన్లు కొత్తవారే

ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ముంబై జట్టు హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) ఎవరికి తెలీని గట్టి ప్యాకేజి ఇచ్చి తెచ్చుకుంది. అలాగే హైదరాబాద్ కు రూ. 20.5 కోట్లతో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ను (Pat Cummins) తెచ్చుకుంది. అందువల్ల ఇద్దరూ కాస్ట్ లీ కెప్టెన్లే కావడంతో ప్రతి మ్యాచ్ కూడా కాస్ట్ లీగానే మారిపోతోంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి?

నేడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరగనుంది. డు జట్ల మధ్య ఇప్పటివరకు 21 మ్యాచ్ లు ఆడగా సన్ రైజర్స్ 9 సార్లు, ముంబై ఇండియన్స్ 12 సార్లు విజయం సాధించాయి. మరి ఈ రోజు మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తోందో చూడాలి.