IPL 2025: CSKలోకి వాషింగ్ట‌న్ సుంద‌ర్?

washington sundar to join csk in ipl 2025

IPL 2025: 2025లో జ‌రిగే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఆడ‌నున్నాడా? సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సుంద‌ర్‌తో క‌లిసి ఫోటోను పోస్ట్ చేయ‌డంతో ఈ ప్ర‌చారం జోరందుకుంది. 2025 ఐపీఎల్ ఆక్ష‌న్‌లో సుంద‌ర్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ కొనుగోలు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. T20I జింబాబ్వే సిరీస్ రేప‌టి నుంచి మొద‌లుకానుంది. ఈ సిరీస్‌లో గైక్వాడ్, సుంద‌ర్ స్వ్కాడ్‌లో భాగంగా ఉన్నారు.

ఈ సిరీస్‌కు తొలిసారి శుభ్‌మ‌న్ గిల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. 2024లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌రఫున ఆడిన సుంద‌ర్ త‌క్కువ స‌మ‌యానికే ప‌రిమితం అయ్యాడు. ఈ జింబాబ్వే సిరీస్‌లో త‌న స‌త్తా నిరూపించుకుంటే వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌లో ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.