Virender Sehwag: నేనే రోహిత్ అయ్యుంటే… వాడికేంటి స‌మాధానం చెప్పేది

virender sehwag says no need to answer to such silly questions

Virender Sehwag:  అస‌లు కాస్త బుర్ర పెట్టి ఆలోచించ‌ని వారికి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎందుకు స‌మాధానం చెప్తున్నాడో అర్థంకావ‌డంలేద‌ని అన్నారు వీరేంద‌ర్ సెహ్వాగ్. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇన్జ‌మామ్ ఉల్ హ‌క్.. అర్ష్‌దీప్ సింగ్ బాల్ టాంప‌రింగ్‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆరోప‌ణ‌లు చేసారు. దీనిపై రోహిత్ శ‌ర్మ స్పందిస్తూ.. పిచ్ ఎండిపోయి ఉంటే బాల్ వెన‌క్కి స్వింగ్ అవుతుంద‌ని ఆ మాత్రం కూడా తెలీనివాళ్లు కాస్త బుర్ర వాడితే బాగుంటుంద‌ని స‌మాధానం ఇచ్చాడు. దీనిపై సెహ్వాగ్ స్పందిస్తూ.. అస‌లు అలాంటివాడికి స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని.. తానే రోహిత్ శ‌ర్మ‌ను అయ్యుంటే అస‌లు రిప్లై కూడా ఇచ్చేవాడిని కాద‌ని మండిప‌డ్డారు.

“” అస‌లు ఆ జ‌ర్న‌లిస్ట్ ఆ ప్ర‌శ్న అడ‌గాల్సిన అవ‌స‌రం ఏముంది? ఎవ‌డో చేసిన కామెంట్‌కి మా అభిప్రాయాలు అడ‌గడం ఏంటి? మీ ద‌గ్గ‌ర సొంత ప్ర‌శ్న‌లు లేవా? నేనే రోహిత్ శ‌ర్మ‌ను అయ్యుంటే అస‌లు స‌మాధానం కూడా ఇచ్చేవాడిని కాదు “” అన్నారు.