Virender Sehwag: టీమిండియా కోచ్‌గా ఉండటం ఇష్టం లేదు
Virender Sehwag: తనకు టీమిండియా కోచ్‌గా ఉండటం ఇష్టం లేదని అన్నారు సీనియర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ 2015లో క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత కోచింగ్, కమెంటేటరీ వంటి రోల్స్ చేసారు. 2016లో పంజాబ్ కింగ్స్ టీంకు కోచ్‌గా వ్యవహరించిన సెహ్వాగ్.. ఆ తర్వాత క్రికెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా పనిచేసారు. పంజాబ్ కింగ్స్‌కి కోచింగ్ ఇచ్చినప్పటికీ టీం ఫైనల్స్ వరకు వెళ్లలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన 2017లో టీమిండియా కోచ్ పదవికి అప్లై చేసారు. కానీ ఆయన బదులు రవి శాస్త్రి ఎంపికయ్యారు.
ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సెహ్వాగ్ టీమిండియా కోచ్ పదవికి అప్లై చేసుకోలేదు. మొన్న రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ సెహ్వాగ్ టీమిండియా కోచ్ పదవిని ఆశించలేదు. ఎందుకు అని అడగ్గా.. తనకు ఆ పదవి చేపట్టడం ఇష్టం లేదని.. ఒక్కసారి టీమిండియా కోచ్ అయితే కుటుంబాన్ని వదిలేసుకోవాలని అన్నారు. కావాలంటే ఏదన్నా ఐపీఎల్ టీంకు కోచ్‌గా ఉంటానని తన మనసులో మాటను బయటపెట్టారు.